పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్ల మంజూరు: మంత్రి కోమటిరెడ్డి
ABN , Publish Date - Oct 23 , 2026 | 07:23 PM
నల్లగొండ జిల్లాలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నల్లగొండ, అక్టోబర్ 23: జిల్లాలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాచీన చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిధుల కేటాయింపుతో ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని, భక్తులు, స్థానిక ప్రజల్లో ఆనందం నెలకొందని తెలిపారు.
శివలింగంపై నిరంతరం ఛాయ కనిపించేలా నిర్మించిన ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి అద్భుత నిదర్శనమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రాచీన కాలంలోనే కాంతి.. నీడలతో పాటు నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనమని వివరించారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు.. యునెస్కో గుర్తింపు సాధించే దిశగా కృషి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం, పర్యాటక ప్రాధాన్యాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రూ.20 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేసి, మరింత మంది పర్యాటకులు, భక్తులు సందర్శించేలా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News