Share News

ట్యాంక్‌ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బూర నర్సయ్యగౌడ్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:30 AM

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ట్యాంక్‌ బండ్‌పై లేదా నెక్లెస్‌ రోడ్డులో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు.

ట్యాంక్‌ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బూర నర్సయ్యగౌడ్‌
Bura Narsaiah Goud

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ట్యాంక్‌ బండ్‌పై లేదా నెక్లెస్‌ రోడ్డులో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు. తెలంగాణ వీరత్వానికి, పౌరుషానికి, ఆత్మగౌరవ పోరాటానికి చిరునామా చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ జయంతి వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. నాడు తెలంగాణలో నిజాం, రజాకార్లు, దొరలు ఉంటే.. నేడు వారి స్థానంలో ఎంఐఎం, కాంగ్రెస్‌, గడీల దొరలు చేరారని మండిపడ్డారు. లక్షల కోట్ల దోపిడీకి ‘హిల్ట్‌’ పాలసీ తెచ్చారని, కోటి ఎకరాల అసైన్డ్‌, పేదల భూములను 22-ఏ పరిధిలో చేర్చి వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:
నవంబరు నెలాఖరులో.. హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ!

ఆయుధాల చోరీ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 06:30 AM