ముమ్మాటికీ ఇది యాంటీ-భారత్ సమ్మిట్
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:05 AM
ఏ విషయంలోనూ స్పష్టమైన వైఖరి, దృక్పథం, విజన్ లేని రాహుల్ కోసం నిర్వహిస్తున్నది భారత్ సమ్మిట్ కాదని, ఇది ముమ్మాటికీ యాంటీ- భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు.
రాహుల్‌కు హైదరాబాద్ వచ్చే హక్కులేదు: రాంచందర్‌రావు
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఏ విషయంలోనూ స్పష్టమైన వైఖరి, దృక్పథం, విజన్ లేని రాహుల్ కోసం నిర్వహిస్తున్నది భారత్ సమ్మిట్ కాదని, ఇది ముమ్మాటికీ యాంటీ- భారత్ సమ్మిట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ర్టానికి ఒక్క పెట్టుబడి దారుడు కూడా రావడం లేదని పేర్కొన్నారు. నాగోల్‌లో జరిగిన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ప్రపంచంలో అరాచకాన్ని సృష్టించే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రోగ్రెసివ్ అలయన్స్, ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ వంటి సంస్థల ప్రతినిధులు మాత్రమే ఈ సదస్సుకు హాజరవుతున్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో జరిగిన అస్థిరత, ఆందోళనల వెనుక ఇలాంటి సంస్థల హస్తం ఉందని, సల్మాన్ ఖుర్షీద్, శ్యామ్ పిట్రోడా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు రాహుల్ గాంధీ అభిప్రాయాలను వినడానికి మాత్రమేనని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఉద్యోగాల పేరిట హామీ లిచ్చి, అమలు చేయకుండా మోసం చేసిన రాహుల్ గాంధీకి హైదరాబాద్‌లో అడుగు పెట్టే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్లజెండాలతో నిరసనలు తెలపాలని, దిష్టిబొమ్మలను దహనం చేయాలనికార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!
రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి