Share News

యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్‌కి తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Aug 07 , 2026 | 09:43 PM

బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో ఏసీ బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి.

యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్‌కి తప్పిన ప్రమాదం
Bidar Yesvantpur Express

సంగారెడ్డి, ఆగస్టు 07: బీదర్ నుంచి యశ్వంతపూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇవాళ(శుక్రవారం) జహీరాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపిస్తున్న సమయంలో రైలు ఇంజన్ వెనుకాలే ఉన్న ఏసీ బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలును వెంటనే స్టేషన్‌లో నిలిపివేశారు.


రైల్వే సాంకేతిక సిబ్బంది ఏసీ బోగీని పరిశీలించారు. ఆ బోగీలోని బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే పొగలు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం సిబ్బంది త్వరితగతిన ఆ లోపాన్ని సరిచేసి మరమ్మతులు పూర్తి చేశారు. సమస్య తొలగిపోవడంతో రైలు తిరిగి యశ్వంతపూర్ వైపు సురక్షితంగా బయలుదేరింది. ఈ ఘటనతో రైలు కాస్త ఆలస్యంగా బయలుదేరింది. అధికారుల సమయస్ఫూర్తితో పెద్ద ముప్పు తప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో రైళ్లలో చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మందు బాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్.

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే.. ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్ రావు..

Updated Date - Aug 07 , 2026 | 09:49 PM