Share News

భద్రాద్రి కొత్తగూడెంలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:33 PM

ఈగల్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద వాహనాలను అడ్డుకున్న పోలీసులు.. రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయిని సీజ్ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
Bhadradri Kothagudem News

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30: జిల్లాలో ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు.. భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. సారపాక ఐటీసీ వెస్ట్ గేట్ సమీపంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశా అడవుల నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు లారీలో ప్రత్యేకంగా ఒక రహస్య భాగాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయిని దాచి తరలిస్తున్నారు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు లారీని సోదా చేసి, దాదాపు 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


పట్టుబడిన ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు 2.62 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు ముగ్గురు నిందితులను ఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న లారీతో పాటు, దానికి ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తున్న ఒక పల్సర్ బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నిందితుల వద్ద ఉన్న 5 మొబైల్ ఫోన్లు, రూ.10,570 నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కరాచీ మిలిటరీ స్థావరంపై దాడి.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్

శ్రీకాకుళం: భావనపాడు బీచ్‌లో విషాదం.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Updated Date - Jun 30 , 2026 | 05:05 PM