క్షతగాత్రులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహాయం..
ABN , Publish Date - Sep 19 , 2026 | 07:50 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్ గొప్ప మనసు చాటుకున్నారు. సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించి, భద్రతా సిబ్బందితో కలిసి క్షతగాత్రులకు సహాయం అందించారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 19: కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. సిద్దిపేట నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో మిగిలిన వారికి ప్రమాదం తప్పింది. అదే సమయంలో బండి సంజయ్ సిరిసిల్ల వైపు వెళ్తుండగా ప్రమాదాన్ని గమనించారు. వెంటనే తన భద్రతా సిబ్బందితో కలిసి వాహనాన్ని ఆపి ప్రమాదానికి గురైన వారి వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, గాయపడిన వారికి తక్షణ సహాయం అందించేలా చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వెంటనే వైద్య చికిత్స అందించేందుకు బండి సంజయ్ చొరవ తీసుకున్నారు. తన భద్రతా సిబ్బంది సహకారంతో బాధితులను బయటకు తీసి, పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రహస్య వివాహం.. కొద్దిరోజులకే భార్యకు షాక్
Read Latest AP News And Telugu News