ఆసిఫాబాద్‌లో దారుణం: రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడి దారుణ హత్య
ABN , Publish Date - Jul 17 , 2026 | 02:04 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు క్రూరంగా హత్య చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్, జులై 17: జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులు వృద్ధుడి తలను, మొండాన్ని వేరు చేసి పడేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పాత కక్షలా లేక మరేదైనా వివాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడు ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తూ విచారణను వేగవంతం చేశారు.
ఇవి కూడా చదవండి...
క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు
Read Latest Telangana News And Telugu News