ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్రెడ్డి
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:59 PM
తెలంగాణలో ధరణి, భూభారతి పోర్టళ్లు, 22-ఏ నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూములు, భూ ఆక్రమణలు, ధరణి, భూభారతి పోర్టళ్లలోని అక్రమాలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు విషయాలను ప్రస్తావించారు.
రాష్ట్రంలో భూములను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ వ్యవహారాలపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై తాము గతంలో అసెంబ్లీలోనూ గళం విప్పినట్లు తెలిపారు. ధరణి పోర్టల్కు సంబంధించి నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టడం లేదని ఆరోపించారు. భూముల వ్యవహారంలో పారదర్శకత ఉండాల్సిన అవసరం ఉందని.. సంబంధిత అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్లో అర్థంలేని మాడ్యూళ్లను ఏర్పాటు చేసి గందరగోళం సృష్టించారని ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. రైతుల భూములకు సంబంధించిన కీలక వివరాలను విదేశీ సంస్థల చేతుల్లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీకి గురయ్యాయని పేర్కొన్నారు. 22-ఏ నిషేధిత భూముల జాబితా, భూ ఆక్రమణల ఆరోపణలు, భూ రికార్డుల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. భూముల రక్షణ, రైతుల హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News