Fact Check: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫేక్ ప్రచారం.. వాస్తవమిదే..
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:21 PM
Fake News on ABN Andhrajyothy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పోస్ట్ చేసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు నకిలీ గాళ్లు. రేవంత్ సర్కార్ ఆంధ్రజ్యోతి కోసం ఫ్యూచర్ సిటీలో ఉచితంగా భూమిని కేటాయించిందని ఇష్టానురీతిలో రాసుకొచ్చారు.
ప్రభుత్వ పథకాలు, కొత్త చట్టాలు దేశ విదేశీ పరిణామలను ప్రజలకు చేరవేయడంలో 'నాల్గవ స్తంభం'గా మీడియా ముందుంటుంది. అదే సమయంలో ప్రజల సమస్యలు, వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుంది. పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా అధికార యంత్రాంగంలో జరిగే అవినీతిని, అక్రమాలను బయటపెట్టి వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో మీడియా కీలకపాత్ర పోషిస్తుంది. అలా.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొన్నేళ్లుగా ప్రజల గొంతై వినిపిస్తోంది. అన్యాయం ఎక్కడ జరిగినా.. ఏబీఎన్ అక్కడకు చేరుకుని వారికి సరైన న్యాయం జరిగేలా పోరాడుతూ ఉంది. అలాంటి ఏబీఎన్‌పై కొందరు ఫేక్‌గాళ్లు ఇటీవల పనికట్టుకుని బురుదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఉందిగా ఏది పడితే అది.. అసంబద్ధమైన వార్తలను రాపిస్తూ నిందలు వేయాలని చూస్తున్నారు. ఇప్పటివరకు మీడియా రంగంలో ఎలాంటి మచ్చలేకుండా ప్రజా వ్యవస్థపై పోరాడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఎవరూ ఏం చేయలేరని గుర్తుపెట్టుకోవాలి.
ఇంటర్నెట్ డెస్క్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియో కోసం.. తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఉచితంగా 25 ఎకరాల భూమిని కేటాయించినట్టు ఓ ఫేక్ పోస్టర్ క్రియేట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అందులో ఆంధ్రజ్యోతి కొత్త స్టూడియోను నిర్మించనుందని పేర్కొన్నారు. అందుకు ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టుగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తప్పుడు కథనం సృష్టించారు ఫేకర్లు. త్వరలో కొత్త స్టూడియో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని ప్రచురించారు. ఇంకో మూడేళ్ల పాటు ఆంధ్రజ్యోతి సంస్థ తనకు మద్దతుగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారని ఇష్టానురీతిలో రాసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని రాధాకృష్ణ ప్రశంసించినట్టు.. గత బీఆర్ఎస్ పాలననలో ఎబీఎన్‌పై ఆంక్షలు విధించారని, ప్రస్తుతం మీడియాకు స్వేచ్ఛ ఉందన్నట్టు కల్పిత వాక్యాలు సృష్టించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణాలో రేవంత్ మళ్లీ గెలుస్తారని రాధాకృష్ణ అన్నారని విష ప్రచారం చేస్తున్నారీ ఫేక్ గాళ్లు.

పై కథనం అంతా.. అచ్చం ఆంధ్రజ్యోతి ఈ-పేపర్లో ప్రచురితమైనట్టుగా 'హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి)' డేట్‌లైన్‌తో డిజైన్ చేసి ఓ స్క్రీన్‌షాట్ తీసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ స్క్రీన్‌షాట్ కింద సోర్స్ కూడా ఆంధ్రజ్యోతి ఈ-పేపర్‌నే వాడుకున్నారీ డూప్లీకేటు గాళ్లు.
ఇదీ అసలు నిజం..
వాస్తవానికి.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణను గత గురువారం(జనవరి 1న) మర్యాదపూర్వకంగా కలిశారు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అంతకుమించి ఏమీ జరగలేదు. కానీ.. ఆ ఫొటోను వాడుకుంటూ ఇలా తప్పుడు కథనాలు రాసి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి నకిలీ మీడియా సంస్థలు.
ఇవీ చదవండి:
ప్రియురాలి మృతి.. తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని ప్రియుడు ఆత్మహత్య
కీలక పరిణామం.. ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి నోటీసులు