Minister Jupally counter: రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు.. మంత్రి జూపల్లి కౌంటర్..
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:38 PM
వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడని, అతడిని నడిబజార్‌లో ఉరి తీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జూపల్లి స్పందించారు.
కేటీఆర్ అవకాశవాద లీడర్ అని, రాహుల్ గాంధీ నిజాయితీ గల లీడర్ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడని, అతడిని నడిబజార్‌లో ఉరి తీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి జూపల్లి స్పందించారు (KTR remarks on Rahul Gandhi).
రాహుల్ గాంధీ నిజాయితీ గల నాయకుడని, ప్రధాని అయ్యే అవకాశాన్ని సైతం వదులుకున్నారని జూపల్లి ప్రశంసించారు (Congress vs BRS). అలాంటి నాయకుడిని ఉరితీయాలనడం సరికాదని జూపల్లి అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ మాటిచ్చారని, ఆ మాట తప్పిన ఆయనకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని జూపల్లి పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని ఇప్పటివరకు ఎందుకు వినియోగించలేదో వివరణ కోరుతూ కలెక్టర్ నోటీస్ ఇవ్వడంలో తప్పులేదని, ఆ కలెక్టర్‌ను అభినందించాలని జూపల్లి అన్నారు.
Also Read:
సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర
కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..
For More Latest News