ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు.. జూన్ 14 దాటితే ..
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:08 PM
ప్రస్తుతం ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డుగా మాత్రమే కాకుండా.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవల్లో కీలకంగా మారింది. ఇదిలావుండగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గడువు తేదీని ఈ ఏడాది జూన్ 14 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఆధార్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డుగా మాత్రమే కాకుండా.. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సేవల్లో కీలకంగా మారింది. ఇదిలావుండగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గడువు తేదీని ఈ ఏడాది జూన్ 14 వరకూ పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వెల్లడించింది. జూన్ 15 నుంచి ప్రతి అప్‌డేట్‌కూ నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సబ్సిడీలు, పెన్షన్లు లేదా ఇతర నగదు సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి చేరడానికి ఆధార్ కీలకం. కాగా, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ కేవైసీ విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఆధార్‌ను ప్రతి ఒక్కరూ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకున్న వారు, ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వివరాలను అప్‌డేట్ చేయని వారు.. తప్పనిసరిగా తమ డాక్యుమెంట్లను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి
For More TG News And Telugu News