Share News

తెలంగాణకు 8 కొత్త రైళ్లు.. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఏ స్టేషన్ల నుంచి నడుస్తాయంటే..

ABN , Publish Date - Apr 21 , 2026 | 09:35 PM

రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను తెలంగాణకు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణకు 8 కొత్త రైళ్లు.. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఏ స్టేషన్ల నుంచి నడుస్తాయంటే..
Telangana new trains 2026

రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా ఈ కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది (Telangana new trains 2026).


హైదరాబాద్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు భువనేశ్వర్, తిరుచానూరు, తిరుపతి, శ్రీ గంగానగర్, జైపూర్ వంటి ముఖ్యమైన నగరాలకు కనెక్టివిటీని పెంచుతాయని, దీంతో ప్రయాణం మరింత సులభతరం అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు (8 new trains Telangana). కాగా, ఈ రైళ్లు మే నుంచి జూలై మధ్య దశల వారీగా ప్రారంభం అవుతాయి.


ఈ రైళ్లన్నీ వారానికి ఒకసారి నడుస్తాయి. కాగా, తెలంగాణకు ఎనిమిది రైళ్లను కేటాయించినందుకు ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్


భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..

Updated Date - Apr 21 , 2026 | 09:39 PM