Grok AI Images Row: కేంద్రం నోటీసులు.. ఆ యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ఎక్స్..
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:07 PM
కేంద్రం ఎక్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది..
ఎక్స్‌లోని గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సృష్టించిన అసభ్య, అశ్లీల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని తీసుకున్న చర్యలపై 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ జనవరి 2న ఎక్స్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అసభ్య కంటెంట్ అంశంలో తగిన చర్యలు తీసుకోని ఎక్స్.. తమ విధానాలను మారుస్తున్నామని కేంద్రానికి బదులిచ్చింది. సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేలా ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ కేంద్రం గురువారం రెండో సారి నోటీసులు జారీ చేసింది. ఎక్స్ తగిన రీతిలో స్పందించకపోతే చట్టప్రకారం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర ఐటీ శాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సృష్టించిన అసభ్య, అశ్లీల కంటెంట్‌పై ఎక్స్ దృష్టి సారించింది. ఇప్పటి వరకు 3,500 పోస్టులు, 600 అకౌంట్స్‌ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై అసభ్య, అశ్లీల కంటెంట్‌ను అనుమతించబోమని, కంటెంట్ విషయంలో ప్రభుత్వ నియమాలను ఫాలో అవుతామని ఎక్స్ కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలిపింది. ఇక, ఇప్పటికే కేంద్రం ఎక్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అశ్లీల, అసభ్యకర కంటెంట్ క్రియేట్ చేయకుండా గ్రోక్ టెక్నికల్, గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్‌ను రివ్యూ చేసుకోవాలని తెలిపింది. యూజర్ పాలసీలు చాలా కఠినంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమించే వారి అకౌంట్లు సస్పెండ్ చేయటం లేదా టెర్మినేట్ చేయాలని స్పష్టం చేసింది.
గ్రోక్ సాయంతో అరాచకాలు..
కొంతమంది యూజర్లు గ్రోక్ సాయంతో అరాచకాలు సృష్టిస్తున్నారు. అశ్లీల, అసభ్య ఫొటోలు తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు అప్‌లోడ్ చేసిన ఆడవారిని టార్గెట్ చేస్తున్నారు. వారి ఫొటోలను గ్రోక్ సాయంతో అసభ్యంగా మారుస్తున్నారు. ఆ అసభ్య ఫొటోలను అన్ని సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు. దీని కారణంగా సదరు ఆడవాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ దారుణాలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలా అధ్యక్షుడిపై దాడికి వినియోగించిన ' రహస్య ఆయుధం' ఏమిటి?
వేయించి పొడిచేస్తే పోషకాలు పోతాయా..?