Share News

Old Laptop Sale - Tips: పాత లాప్‌టాప్‌ను అమ్మేస్తు్న్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:09 PM

పాత లాప్‌టాప్ లేదా పీసీని విక్రయించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Old Laptop Sale - Tips: పాత లాప్‌టాప్‌ను అమ్మేస్తు్న్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Selling Old Laptop-Tips

ఇంటర్నెట్ డెస్క్: పాత ల్యాప్‌టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్‌ పాతదైనప్పుడు అనేక సమస్యలు మొదలవుతాయి. బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. డివైజ్ నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో కొత్త లాప్‌టాప్‌ లేదా పీసీని కొనే ముందు అనేక మంది పాత వాటిని విక్రయించేందుకు ట్రై చేస్తుంటారు. ఇలా చేసే వారు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం (Tips for Selling Old Laptops).

డేటా బ్యాకప్

పాత్ లాప్‌‌టాప్ లేదా పీసీని విక్రయించే ముందు అందులోని డేటాను బ్యాకప్ చేసుకోవాలి. అంటే, వాటిల్లోని సమాచారం మొత్తాన్ని మరో పెన్‌డ్రైవ్, ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లేదా క్లౌడ్ స్టోరేజీలోకి మార్చుకోవాలి. దీంతో, మన ముఖ్యఫైల్స్ ఇతర సమాచారం అంతా భద్రతంగా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ ట్రాన్స్‌ఫర్

డబ్బులు చెల్లించిన కొనుక్కున్న సాఫ్ట్‌వేర్ ఏదైనా పాత సిస్టమ్‌లో ఉందనుకుంటే ముందుగా దాన్ని మరో సిస్టమ్‌లోకి మార్చాలి. అడోబీ ఆక్రోబ్యాట్ లాంటి సాఫ్ట్‌వేరల్లో డీయాక్టివేట్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీనితో లైసెన్స్‌ను మరో డివైజ్‌కు సులువుగా మార్చుకోవచ్చు.


స్టోరేజీ క్లీన్

బ్యాకప్ తరువాత పాత పీసీ లేదా లాప్‌టాప్‌లోని సమాచారం మొత్తాన్ని డిలీట్ చేయాలి. ఇందుకోసం అవసరమనుకుంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. దీంతో, డేటా లీక్ ముప్పు తొలగిపోతుంది.

రీసైక్లింగ్

పాత లాప్‌టాప్ లేదా పీసీ పూర్తి నిరుపయోగంగా మారిందని అనుకుంటే రీసైక్లింగ్‌కు ఇవ్వడమే ఉత్తమం. అనేక ఎలక్ట్రానిక్ స్టోర్లు, సర్వీస్ సెంటర్లలో రీసైక్లింగ్‌కు అవకాశం ఉంటుంది. దీంతో, పర్యావరణానికి ఎలాంటి హానీ జరగకుండా వాటిని వదిలించుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాత డివైజులను వదిలించుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాదని నిపుణులు భరోసా ఇస్తున్నారు.


ఇవీ చదవండి:

ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు.. ఆశ్చర్యపోవాల్సిందే

iPhone నెమ్మదిస్తోందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతుంది!

Updated Date - Jan 05 , 2026 | 02:12 PM