OnePlus Turbo Series: 9000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.. 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్..
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:17 PM
చైనా ఫోన్ మేకర్ వన్‌ప్లస్ టర్బో సిరీస్ పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. చైనాలో జనవరి 8న ఈ సిరీస్‌ను లాంఛ్ చేయనుంది. 9000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో ఈ మోడల్ ఫోన్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా ఫోన్ మేకర వన్‌ప్లస్ మరో భారీ ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. టర్బో సిరీస్ పేరిట ఈ ఫోన్‌లను తొలుత చైనాలోనే జనవరి 8న లాంఛ్ చేయనుంది. భారీ సామర్థ్యం, ఫాస్ట్ చార్జింగ్ సాంకేతికతతో ఈ ఫోన్‌లను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది (OnePlus Turbo Series Launch).
బాహుబలి బ్యాటరీ
టర్బో 6, టర్బో 6వీ మోడల్స్‌లో 9000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం కలిగిన భారీ సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించనున్నారు. ఇది చాలదన్నట్టు వీటిల్లో 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
స్లిమ్ కెమెరా మాడ్యూల్
గత కొన్నేళ్లుగా ఫోన్ కెమెరాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫోన్ వెనకవైపు ఇవి పొడుచుకు వచ్చి పెద్ద బంప్‌లా కనిపిస్తున్నాయి. అయితే, తమ తాజా ఫోన్స్‌లో కేవలం 1.7 ఎమ్ఎమ్ మందం కలిగిన అల్ట్రా సిమ్ కెమెరా బంప్ ఉంటుందని వన్ ప్లస్ చెప్పింది. ఇక టర్బో 6వీ మోడల్‌లో అయితే ప్రత్యేక కెమెరా ఐల్యాండ్‌లో వీటిని అమర్చినట్టు చెప్పుకొచ్చింది. అయితే, రెండు ఫోన్‌లల్లో ప్లాస్టిక్ ఫ్రేమ్స్, బ్యాక్‌ప్లేట్స్‌తో డిజైన్ చేసినట్టు సమాచారం. ధరలను తగ్గించేందుకే ఇలా చేసినట్టు తెలుస్తోంది.
బ్యాటరీ, చార్జింగ్‌తో పాటు ఫోన్ పనితీరును మెరుగుపరిచేలా వన్‌ప్లస్ టర్బో మోడళ్లకు అనేక కొత్త ఫీచర్లను జోడించింది. టర్బో 6లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, టర్బో 6వీలో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రెండిట్లోనూ 1.5కే అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేస్ ఉన్నప్పటికీ టర్బో 6లో 165 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేటు, టర్బో 6వీలో 144 హెర్ట్‌జ్ రీఫ్రెష్ రేటు ఉండనున్నట్టు సమాచారం. రెండిట్లోనూ డ్యూయెల్ రియర్ కెమెరాలను ఇచారు. 50 ఎమ్‌పీ మెయిన్, 8 ఎమ్‌పీ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 32 ఎంపీ సెల్ఫీ షూటర్ కెమెరాలను ఇచ్చారు. ఇక వీటి ధరలపై ఇంకా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ భారత్‌లో వీటి ధర రూ.30 వేలకు కాస్త అటూఇటూగా ఉండే అవకాశం ఉందనేది టెక్ వర్గాల్లో టాక్. ఇక భారత్‌లో ఈ సిరీస్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనేదానిపై కూడా ఇంకా స్పష్టత లేదు.
ఇవీ చదవండి
iPhone నెమ్మదిస్తోందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే అర్థమవుతుంది!
ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు.. ఆశ్చర్యపోవాల్సిందే