వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:34 PM
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్ తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్‌లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు.
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ మంచి అప్లికేషన్ అని, దీనిలో ఆడియో, వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్‌తో పాటు అనేక ఫీచర్స్ ఉన్నాయని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ యాప్‌లో ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఆటలు ఆడుకోవచ్చని, ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసి వినియోగించుకోవచ్చని చెప్పారు (Samvadini app).
ఇతర భాషల్లో మాట్లాడే మాటలు మాతృ భాషలో వినేలా హైప్డ్ సంవాదినీ అప్లికేషన్‌ను రూపొందించామని, సిమ్ బైండింగ్, డివైజ్ బైండింగ్ చేశామని, ఫ్రాడ్ కాల్స్ వచ్చే అవకాశం లేదని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ తెలిపారు. కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తితో మాట్లాడే అవకాశం ఉండదని, ఫోన్ నంబర్ సురక్షితంగా ఉంటుందని, సురక్షితంగా డేటా షేర్ చేసుకోవచ్చని వెల్లడించారు. వాట్సాప్ వినియోగదారులకంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగించే విధంగా అప్లికేషన్‌ను రూపొందించామని, ఏఐ జెన్ జీ కీబోర్డును 22 భారతీయ భాషల్లో రూపొందించామన్నారు (messaging apps India).
దేశ ప్రజలంతా ఈ అప్లికేషన్, కీబోర్డును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు (Samvadini features). వీటిని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులంతా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చన్నారు. హైప్డ్ సంవాదిని వాట్సాప్ తరహాలో ఎండ్- టు- ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటుందని, అడ్వాన్స్‌డ్ యాంటీస్పామ్ మెకానిజాన్ని ఇందులో పొందుపరిచామని తెలిపారు. ఇది సైబర్ మోసాలను నియంత్రిస్తోందని అనువాదిని సంస్థ సీఈఓ బుద్ధా చంద్రశేఖర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..
ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..