PSLV-C62: అంతరిక్షంలో అద్భుతం.. సజీవంగా బుల్లి శాటిలైట్
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:21 PM
ఇటీవల ఇస్రో ప్రయోగించిన PSLV-C62 విఫలమైనప్పటికీ ఓ శుభవార్త వచ్చింది. రాకెట్ థర్డ్ స్టేజ్ చివరిలో తప్పు దొర్లడంతో పాత్ డీవియేటై ఆర్బిట్‌లోకి చేరలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే.. అనూహ్యంగా మోసుకెళ్లిన మొత్తం 16 శాటిలైట్లలో ఒక్కటి మాత్రం పనిచేస్తోంది.
ఆంధ్రజ్యోతి, జనవరి 13: ఇస్రో కొత్త సంవత్సరంలో చేసిన మొదటి మిషన్ PSLV-C62 జనవరి 12న శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది. ఈ మిషన్‌లో ప్రధాన పేలోడ్.. DRDO స్ట్రాటజిక్ ఇమేజింగ్ సాటిలైట్ EOS-N1(అన్వేష)తో పాటు మొత్తం 16 శాటిలైట్లు పైకి తీసుకెళ్లింది. కానీ.. రాకెట్ థర్డ్ స్టేజ్(PS3)లో అనోమలీ(తప్పు) దొర్లడంతో రాకెట్ పాత్ డీవియేట్ అయి ఆర్బిట్‌లోకి చేరలేకపోయింది. ఫలితంగా అన్ని శాటిలైట్లు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ వైఫల్యం మధ్య ఓ సానుకూల విషయం జరిగింది. స్పానిష్ స్టార్టప్ Orbital Paradigmకు చెందిన Kestrel Initial Demonstrator(KID) అనే 25 కిలోల ఫుట్‌బాల్ సైజు ప్రొటోటైప్ శాటిలైట్‌నూ PSLV-C62 ద్వారా అంతరక్షంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ శాటిలైట్ అనూహ్యంగా పనిచేయడం ప్రారంభించింది. రాకెట్ నుంచి విడిపోయిన ఈ బుల్లి శాటిలైట్.. తీవ్రమైన రీ-ఎంట్రీ పరిస్థితులను(పీక్ డెసెలరేషన్ 28g, అధిక ఉష్ణోగ్రతలు, థర్మల్ స్ట్రెస్) తట్టుకుని, 3 నిమిషాలకుపైగా అంతరిక్షం నుంచి ఇంటర్నల్ టెంపరేచర్లు వంటి కీలక డేటా భూమికి పంపింది.
'మా KID క్యాప్సూల్.. PSLV C62 నుంచి విడిపోయి.. ఆన్ అయి 3+ నిమిషాలు డేటా ట్రాన్స్‌మిట్ చేసింది. ట్రాజెక్టరీని రీకన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం. పీక్ హీట్, పీక్ G-లోడ్(~28g) గ్రావిటీ ఫోర్స్ తట్టుకుంది. ఇంటర్నల్ టెంప్స్ ఉన్నాయి' అని Orbital Paradigm ప్రకటించింది. ఈ శాటిలైట్‌ను రీ-ఎంట్రీ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి రూపొందించారు. భవిష్యత్తులో శాటిలైట్ సర్వీసింగ్, డీ-ఆర్బిటింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రైవేట్ స్పేస్ వెంచర్లకు, క్యూబ్‌సాట్ ఇన్నోవేటర్లకు పెద్ద మైలురాయి అని సందరు సంస్థ అంటోంది.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News