Share News

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:20 PM

బుధవారం దేశంలోని పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో గూగుల్ క్లౌడ్ సేవలపై ప్రభావం పడింది.

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..
Google Cloud Outage

బుధవారం దేశంలోని పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో గూగుల్ క్లౌడ్ సేవలపై ప్రభావం పడింది. ఈ ఘటన కారణంగా అత్యవసరంగా కొన్ని నెట్‌వర్క్ పరికరాలను నిలిపివేయాల్సి వచ్చిందని గూగుల్ వెల్లడించింది (Google Cloud Outage).


డేటా సెంటర్‌లో ప్రమాదం కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సామర్థ్యం తగ్గిపోయింది. వినియోగదారులు అధిక లేటెన్సీ, ప్యాకెట్ లాస్ వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. సమస్య తీవ్రతను తగ్గించేందుకు గూగుల్ ప్రభావిత కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను మళ్లించింది. అయినప్పటికీ కొంతమంది వినియోగదారులు నెమ్మదైన కనెక్టివిటీ, యాప్‌లు, వెబ్‌సైట్ల పనితీరులో అంతరాయాలను ఎదుర్కొన్నారు (Delhi Data Centre Fire).


కాగా, డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం ఎప్పుడు జరిగింది (Google Cloud India), దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయా అనే వివరాలను గూగుల్ వెల్లడించలేదు. ప్రస్తుతం సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు చర్యలు చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..


బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 10 , 2026 | 02:27 PM