Gmail: జీమెయిల్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఇన్‌బాక్స్‌ను మరింత స్మార్ట్‌గా మార్చిన గూగుల్
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:11 PM
మన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జీ మెయిల్ ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. జీ మెయిల్ ఇప్పుడు మరింత స్మార్ట్ అవుతోంది. మీరు రాసిన మెయిల్స్ లోని అక్షర, గ్రామర్ దోషలను సరిచేస్తుంది. ఇన్‌బాక్స్ ఓవర్‌లోడ్ సమస్యను తగ్గించబోతోంది.
ఆంధ్రజ్యోతి, జనవరి 14: గూగుల్ తన పాపులర్ ఈ-మెయిల్ సర్వీస్ జీమెయిల్‌కు జనవరి 2026లో భారీ ఏఐ అప్‌డేట్ తీసుకొచ్చింది. జెమిని 3 మోడల్ పవర్‌తో ఈ కొత్త ఫీచర్లు వచ్చాయి. ఇకపై ఇన్‌బాక్స్ కేవలం మెయిళ్ల సేకరణ మాత్రమే కాదు.. ఇది మీ పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది.
ముఖ్య ఫీచర్లు
ఏఐ ఓవర్‌వ్యూస్ (AI Overviews)
పొడవైన ఈ-మెయిల్ థ్రెడ్‌లను కీ పాయింట్ల సారాంశంగా చూపిస్తుంది. ఈ ఫీచర్ అందరికీ ఉచితం
ఇన్‌బాక్స్‌లో మీ భాషలో ప్రశ్నలు అడిగితే జవాబులిస్తుంది, అయితే, ప్రశ్నలు అడగడం Google AI Pro/Ultra సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం.
హెల్ప్ మీ రైట్ & సజెస్టెడ్ రిప్లయిస్
టెక్స్ట్ ప్రాంప్ట్‌తో పూర్తి ఈ-మెయిళ్లు రాయవచ్చు లేదా డ్రాఫ్ట్‌లను మెరుగుపరచవచ్చు. సజెస్టెడ్ రిప్లయిస్ చూపిస్తుంది. (మీ రాత శైలికి సరిపడేలా కాంటెక్స్ట్ ఆధారంగా సూచిస్తాయి). ఇవి అందరికీ ఉచితం.
ప్రూఫ్‌రీడ్ ఫీచర్
మీరు కంపోజ్ చేసిన మెయిల్ గ్రామర్, స్టైల్, టోన్ సరిచేస్తుంది. ఇది ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు (Google AI Pro/Ultra) అందుబాటులో ఉంది.
ఏఐ ఇన్‌బాక్స్ (AI Inbox)
ఈ ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్‌లో ఉంది. మీ ఈ-మెయిళ్లు, కాంటాక్ట్స్ ఆధారంగా మీరు చేయాల్సిన పనులను ప్రాధాన్యత క్రమంలో చూపిస్తుంది. బిల్లులు, అపాయింట్‌మెంట్లు గుర్తుచేస్తుంది. VIPలను (తరచూ మెయిల్ చేసేవారు) గుర్తిస్తుంది. ప్రైవసీ ప్రొటెక్షన్‌తో సురక్షితంగా పనిచేస్తుంది. త్వరలో మరింత మంది వినియోగదారులకు ఈ సర్వీస్ విస్తరించనుంది. ఈ ఫీచర్లు మొదట అమెరికాలో ఇంగ్లీష్‌లో రోల్ అవుట్ అవుతున్నాయి. త్వరలో ఇతర భాషలు, దేశాలకు (తెలుగు సహా) వస్తాయని గూగుల్ తెలిపింది.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..