167 ఏళ్ల గణిత రహస్యాన్ని ఛేదించిన క్లాడ్ ఏఐ? ఆంథ్రోపిక్ శాస్త్రవేత్త సంచలన ప్రకటన..
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:46 PM
ఇప్పటివరకు ప్రపంచ గణిత శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఓ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోగే ప్రకటించారు. ఇందుకోసం ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐ సాయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకు ప్రపంచ గణిత శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఓ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోగే ప్రకటించారు. ఇందుకోసం ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐ సాయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు 167 ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రీమాన్ పరికల్పనకు రుజువు కనుగొన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటన గణిత ప్రపంచంతో పాటు సాంకేతిక రంగంలోనూ ఆసక్తి రేపుతోంది. అయితే ఈ రుజువును ప్రపంచ గణిత నిపుణులు ఇంకా పూర్తిగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంది (Claude AI, Anthropic).
1859లో జర్మనీకి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త బెర్న్‌హార్డ్ రీమాన్ ఈ పరికల్పనను ప్రతిపాదించారు. ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5, 7, 11 వంటి సంఖ్యలు ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా కనిపిస్తాయి. అయితే వాటి పంపిణీ వెనుక ఒక లోతైన గణిత క్రమం ఉందని రీమాన్ భావించారు. దీనిని నిరూపించగలిగితే ప్రధాన సంఖ్యల పంపిణీపై గణిత శాస్త్రవేత్తలకు మరింత స్పష్టత వస్తుంది. సంఖ్యా సిద్ధాంతంతో పాటు గణితంలోని అనేక ఇతర విభాగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఆంథ్రోపిక్‌లో పనిచేస్తున్న గణిత శాస్త్రవేత్త లెవెంట్ ఆల్పోగే ఈ సమస్యపై చాలా కాలంగా ఆసక్తి చూపుతున్నారు. క్లాడ్ ఏఐతో కలిసి గత కొన్ని నెలలుగా పరిశోధన కొనసాగించినట్లు వెల్లడించారు (Riemann Hypothesis).
ఈ పరికల్పన ప్రారంభంలో ఏఐకి సరైన మార్గాన్ని తాను సూచించానని, అయితే చివరి దశలో క్లాడ్ తన అంచనాలకు మించి వేగంగా ముందుకు వెళ్లిందని ఆల్పోగే పేర్కొన్నారు (AI Mathematics). ఏఐ అందించిన గణిత ఆలోచనలు తనను ఆశ్చర్యపరిచాయని వెల్లడించారు. నవంబర్ 20న తన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో నాలుగు పేజీల ప్రకటన విడుదల చేస్తూ, క్లాడ్‌తో కలిసి రీమాన్ పరికల్పనకు రుజువు కనుగొన్నానని పేర్కొన్నారు. సాధారణ పరికల్పనతో పాటు దాని విస్తృత రూపమైన జనరలైజ్డ్ రీమాన్ పరికల్పనకూ ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్‌ను చూసి నేర్చుకోండి.. అమెరికా వడ్డీ రేట్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..