ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఇది మీ కోసమే..
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:59 PM
ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే, ఇది మీ కోసమే. ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా ఇకపై ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే, ఇది మీ కోసమే. ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా ఇకపై ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తాజాగా, అద్భుతమైన అప్‌డేట్‌ను ఆధార్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా మొబైల్ యాప్‌లోనే ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ లేదా కొత్తగా యాడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.
జులై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు 6 నెలల పాటు ఎలాంటి ఖర్చు లేకుండా యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ లేదా కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ అప్‌డేట్‌కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,50,000 మంది తమ ఈమెయిల్ ఐడీలను విజయవంతంగా అప్‌డేట్ చేసుకున్నారు. ఆధార్‌తో ఈమెయిల్ ఐడీని లింక్ చేయడం ద్వారా మరింత భద్రత లభిస్తుంది. ఓటీపీ లేదా బయోమెట్రిక్ కోసం మన ఆధార్ కార్డ్‌ని ఉపయోగించినపుడు మనకు వెంటనే రియల్ టైమ్ ఈమెయిల్ అలర్ట్ వస్తుంది. తద్వారా మోసాలను అరికట్టడానికి అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కోసం ఎదురుచూస్తున్నా: మంత్రి జూపల్లి కృష్ణారావు