Share News

మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:17 PM

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయన్న వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఘటనపై వివరణ ఇవ్వాలని ఇన్‌స్టా మాతృసంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది.

మైనర్లపై లైంగిక వేధింపుల కంటెంట్‌తో యాడ్స్.. మెటాకు కేంద్రం నోటీసులు
Centre Notice to Meta Over Child Abuse Ads

ఇంటర్నెట్ డెస్క్: చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయన్న వార్తలపై కేంద్రం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ మెటాకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలను ఎలా అనుమతించారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇలాంటి యాడ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఏం చర్యలు తీసుకున్నదీ చెప్పాలని కూడా ఆదేశించింది.

ఈ ఉదంతంపై బీబీసీ తొలుత ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌ విక్రయాలకు సంబంధించి యాడ్స్‌ భారత్‌లోని ఇన్‌స్టా అకౌంట్స్‌లో కనిపించాయంటూ ఒక పరిశోధాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ యాడ్స్‌ పలు టెలిగ్రామ్ ఛాన్సల్స్‌కు సంబంధించినవని పేర్కొంది. కేవలం రూ.99లకే కంటెంట్ లభిస్తుందంటూ యాడ్స్ ఉన్నాయని పేర్కొంది.


ఈ కథనంపై ఇన్‌స్టాగ్రామ్ 24 గంటల తరువాత స్పందించిందని బీబీసీ పేర్కొంది. అకౌంట్స్‌ను సస్పెండ్ చేశామని తెలిపినట్టు పేర్కొంది. దీంతో, ఈ ఉదంతంపై వివరణ కోరుతూ కేంద్రం కూడా మెటాకు తాజాగా నోటీసులు జారీ చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

దోషులను కఠినంగా శిక్షించాలి.. రామ్ మందిర్ విరాళాల వివాదంపై ఆర్ఎస్ఎస్..

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటుకు కుట్ర.. 8 మంది అరెస్ట్..

Updated Date - Jul 03 , 2026 | 06:31 PM