Share News

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌‌రావు కోసం ఎదురుచూస్తున్నా: మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:04 PM

తెలంగాణ అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌‌లో చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌కు ఆయన సవాల్‌ విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌‌కు వస్తానని చెప్పారు. ఈ మేరకు మంత్రి జూపల్లి శుక్రవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌‌రావు కోసం ఎదురుచూస్తున్నా: మంత్రి జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao

ఇంటర్‌నెట్ డెస్క్: తెలంగాణ అప్పులపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌‌లో చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌కు ఆయన సవాల్‌ విసిరారు. సాయంత్రం 5 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌‌కు వస్తానని చెప్పారు. ఈ మేరకు మంత్రి జూపల్లి శుక్రవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. సవాల్‌పై కట్టుబడి ఉన్నందునే ప్రెస్‌క్లబ్‌కు వచ్చానన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. తాను వెనుకడుగు వేసి పారిపోయే వ్యక్తిని కానన్నారు.


ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుకు 4 పేజీల చొప్పున లేఖలు రాశా. ముగ్గురికీ వాట్సాప్‌లోనూ ఆధారాలతో లేఖలు పంపించా. రూ.4.17 లక్షల కోట్ల అప్పు అంటూ హరీశ్ రిటర్న్‌ లేఖ పంపారు. రూ.8.21 లక్షల కోట్ల అప్పు అని లేఖలో చెప్పా. పారిపోవడం మా ఇంటావంటా లేదు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. లేఖలో నేను ప్రస్తావించినవి అబద్ధాలని నిరూపించగలరా?’..


‘నేను చెప్పినవి అబద్ధాలైతే రాజీనామాకు సిద్ధం. హరీశ్‌రావు సొల్లు పురాణం చెబుతున్నారు. నా ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు. నేను అడిగింది ఏంటి? హరీశ్ చెప్పిందేంటి?. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ కోసం 3 కుర్చీలు వేశాం. హరీశ్‌రావు రాసిన లేఖలో ఏమీ లేదు. ఇప్పటికైనా విలువలతో బతకండి’ అని అన్నారు. కాగా, చర్చకు రావాలని పిలిచి పోలీసులతో అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీకి ఇంత హైప్ ఇవ్వకండి: కపిల్ దేవ్

భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదు : కందుల దుర్గేష్

Updated Date - Jul 03 , 2026 | 06:13 PM