అమ్మాయిల తొలి ప్రత్యర్థి మలేసియా
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:26 AM
ఓవైపు పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా, మహిళల టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది...
న్యూఢిల్లీ: ఓవైపు పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా, మహిళల టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. వచ్చేనెల 19 నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ వేదికగా మహిళల చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఆతిథ్య భారత్, జపాన్, చైనా, మలేసియా, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా పోటీపడే ఈ టోర్నీ నవంబరు 28న ముగియనుంది. హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన భారత్ తన పోరును తొలిరోజు మలేసియాతో ఆడనుంది. అదేరోజు జరిగే ఆరంభ మ్యాచ్‌లో చైనా, థాయ్‌లాండ్ తలపడతాయి. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లను 21న కొరియాతో, 22న థాయ్‌లాండ్‌తో, 24న చైనాతో, 25న జపాన్‌తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ
అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!