నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. జింబాబ్వే 131 ఆలౌట్
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:04 PM
వడోదర వేదికగా జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా జట్టు అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. భారత బౌలర్ వైష్ణవి శర్మ ధాటికి 39.5 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.
స్పోర్ట్స్ డెస్క్: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టు జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా జట్టు అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే భారత బౌలర్ వైష్ణవి శర్మ ధాటికి 39.5 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్, వికెట్ కీపర్ మోడెస్టర్ ముపాచిక్వా (37) టాప్ స్కోరర్ నిలిచింది. కెప్టెన్ జోసెఫిన్ ఎన్కోమో (35) పరుగులు చేసింది. చిద్జా ధురురు 20, న్యాషా గ్వాంజురా 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుంది. వైష్ణవి 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించింది. అలానే క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే 2 వికెట్లు పడగొట్టారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి.. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో స్మృతి మంధాన జట్టు ఉంది. అలానే చివరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనే కసితో జింబాబ్వే జట్టు ఉంది. అయితే భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు జింబాబ్వే ఆశలకు ఆడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాకు 131 పరుగులు పెద్ద టార్గెట్ కాదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..
ఉద్యోగులకు డీఏ, డీఆర్ పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
పాక్ గడ్డపై చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్.. 30 ఏళ్ల రికార్డు బ్రేక్