వైష్ణవి-రుతుజ జోడీ సంచలనం
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:36 AM
భారత టెన్నిస్ జోడీ వైష్ణవి అద్కర్ - రుతుజ భోసాలె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ జంట చెన్నై ఓపెన్‌లో మహిళల డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది...
చెన్నై ఓపెన్‌లో ఫైనల్‌కు
చెన్నై: భారత టెన్నిస్ జోడీ వైష్ణవి అద్కర్ - రుతుజ భోసాలె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ జంట చెన్నై ఓపెన్‌లో మహిళల డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో డబ్ల్యూటీఏ టూర్ స్థాయి టోర్నీలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా జోడీగా వైష్ణవి, రుతుజ చరిత్ర సృష్టించారు. గతంలో సానియా మీర్జా ఎన్నో డబ్ల్యూటీఏ డబుల్స్ ట్రోఫీలు నెగ్గినా.. ఆమె జత కట్టిన క్రీడాకారిణులంతా ఇతర దేశాలవాళ్లు కావడం గమనార్హం. శనివారం జరిగిన సెమీఫైనల్లో వైష్ణవి ద్వయం 6-2, 2-6, 10-8తో రెండో సీడ్ జోడీ వెరోనికా ఫాల్కోవస్కా (పోలెండ్)-అలనా స్మిత్ (అమెరికా)ను కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో స్విట్జర్లాండ్ జంట నైమా కరమాకో-సిమోనా వాల్టర్ట్‌తో వైష్ణవి జోడీ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News