India Under 19 Cricket: చెలరేగిన వైభవ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:11 AM
వైభవ్ సూర్యవంశీ (24 బంతుల్లో ఫోర్, 10 సిక్స్‌లతో 68) అదిరే అర్ధ శతకంతోపాటు పేసర్ కిషన్ సింగ్ (4/46) నిప్పులు చెరగడంతో.. దక్షిణాఫ్రికాతో...
8 వికెట్లతో భారత్ గెలుపు
రెండో వన్డేలోనూ సౌతాఫ్రికా చిత్తు
బెనోని: వైభవ్ సూర్యవంశీ (24 బంతుల్లో ఫోర్, 10 సిక్స్‌లతో 68) అదిరే అర్ధ శతకంతోపాటు పేసర్ కిషన్ సింగ్ (4/46) నిప్పులు చెరగడంతో.. దక్షిణాఫ్రికాతో అండర్-19 వన్డే సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకొంది. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల (డ/లూ పద్ధతి) తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. జాసన్ రౌల్స్ (114) శతకం సాధించాడు. ఛేదనలో ప్రతికూల వాతావరణం కారణంగా లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 23.3 ఓవర్లలో 176/2తో ఛేదించింది. అర్ధ శతకం సాధించిన వైభవ్‌ను మైకేల్ పెవిలియన్ చేర్చాడు. వేదాంత్ త్రివేది (31 నాటౌట్), అభిజ్ఞాన్ (48 నాటౌట్) 81 పరుగులు జోడించడంతో.. భారత్ మరో 21 బంతులు మిగిలుండగానే గెలిచింది. సిరీ్‌సలోని మూడో, ఆఖరి వన్డే బుధవారం జరగనుంది.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి