క్రీడా అవార్డుల ప్రదానం
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:31 AM
క్రీడా అవార్డులు సుదీర్ఘకాల తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా అథ్లెట్లు అభివర్ణించారు.
‘అర్జున’ అందుకున్న తెలుగు షూటర్ శ్రీకాంత్
న్యూఢిల్లీ: క్రీడా అవార్డులు సుదీర్ఘకాల తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా అథ్లెట్లు అభివర్ణించారు. ప్రతిష్ఠాత్మక అర్జున, ద్రోణాచార్య పురస్కారాలను అథ్లెట్లు, కోచ్‌లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా శుక్రవారం అందుకున్నారు.
డెకాథ్లెట్ తేజస్విన్ శంకర్, చెస్ గ్రాండ్‌మాస్టర్లు దివ్యా దేశ్‌ముఖ్, విదిత్ గుజ్‌రాతీ, హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్ సియామి, తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుష్ శ్రీకాంత్, పారా షూటర్ రుద్రాన్ష్, బాక్సర్ నరేందర్ అర్జున పురస్కారాలను స్వీకరించారు. కాగా, అర్జున పురస్కారానికి ఎంపికైన తెలుగు షట్లర్ గాయత్రీ గోపీచంద్ జపాన్ ఓపెన్‌లో ఆడుతున్న కారణంగా ఈ వేడుకకు హాజరవలేదు.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!