Share News

క్వార్టర్స్‌లో తన్వీ, ఉన్నతి

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:38 AM

తన్వీ శర్మ, ఉన్నతి హుడా, అన్‌మోల్‌ ఖర్బ్‌తో పాటు డిఫెండింగ్‌ చాంప్‌ ట్రీసా జాలీ-గాయత్రి జోడీ సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ...

క్వార్టర్స్‌లో తన్వీ, ఉన్నతి

  • గాయత్రి జోడీ కూడా..

  • సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ

లఖ్‌నవూ: తన్వీ శర్మ, ఉన్నతి హుడా, అన్‌మోల్‌ ఖర్బ్‌తో పాటు డిఫెండింగ్‌ చాంప్‌ ట్రీసా జాలీ-గాయత్రి జోడీ సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకొన్నారు. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో ట్రీసా-గాయత్రి జంట 21-9, 21-8తో శ్రేయ-ప్రణవిపై, అశ్విని భట్‌-శిఖా గౌతమ్‌ జంట 16-21, 21-12, 21-19తో మాన్య-రేశికపై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో అన్‌మోల్‌ 21-16, 21-15తో అస్మిత చాలీహాపై, ఉన్నతి 21-14, 21-18తో ఇషికా జైస్వాల్‌పై, తన్వీ శర్మ 18-21, 21-18, 21-18తో ముతిర ఆయు పుష్పితసరిపై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో తుషార్‌ సువీర్‌ 21-14, 21-12తో సుశ్వత్‌ దలాల్‌పై గెలిచి ముందంజ వేశాడు.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 05:38 AM