Share News

టీ20 ప్రపంచ కప్: జింబాబ్వే చిత్తు.. సౌతాఫ్రికా ఘన విజయం

ABN , Publish Date - Mar 01 , 2026 | 06:33 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

టీ20 ప్రపంచ కప్: జింబాబ్వే చిత్తు.. సౌతాఫ్రికా ఘన విజయం
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా సూపర్ 8లో జింబాబ్వే తన రెండో ఓటమిని చవిచూసింది.


సౌతాఫ్రికా బ్యాటర్లలో బ్రెవిస్(42) రాణించాడు. ర్యాన్ రికెల్టన్(31), డేవిడ్ మిల్లర్(22) పర్వాలేదనిపించారు. స్టబ్స్(21*), లిండే(30*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్లు మార్క్‌రమ్(4), డికాక్(0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికందర్ రజా 3 వికెట్లతో చెలరేగాడు. ముజరబాని, ఎవాన్స్ తలోక వికెట్ పడగొట్టారు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా(73; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బెన్నెట్(15) విఫలమయ్యాడు. మదండే(26) పర్వాలేదనిపించాడు. మారుమణి(7), మైయర్స్(11), బర్ల్(5), మున్యోంగ(2), ఎవాన్స్(8) నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా 2, బోష్ 2, లిండే, లుంగి ఎంగిడి, అన్రిచ్ తలొక వికెట్ పడగొట్టారు. కాగా సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 01 , 2026 | 06:33 PM