Share News

టీ20 ప్రపంచ కప్: సంజు ‘షో’.. సెమీస్‌కు భారత్

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:01 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశను టీమిండియా ఘనంగా ముగించింది. విండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఎన్నో విమర్శలకు గురైన సంజు శాంసన్.. కీలక పోరులో జట్టుకు అండగా నిలిచి గెలిపించాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టీ20 ప్రపంచ కప్: సంజు ‘షో’.. సెమీస్‌కు భారత్
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశను టీమిండియా ఘనంగా ముగించింది. విండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఎన్నో విమర్శలకు గురైన సంజు శాంసన్.. కీలక పోరులో జట్టుకు అండగా నిలిచి గెలిపించాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో సెమీస్‌కు అర్హత సాధించింది. మార్చి 5న ఇంగ్లండ్‌తో వాంఖడే స్టేడియం వేదికగా సెమీ ఫైనల్‌లో తలపడనుంది.


అభిషేక్ శర్మ(10), ఇషాన్ కిషన్(10), సూర్యకుమార్ యాదవ్(18), తిలక్ వర్మ(27), హార్దిక్ పాండ్య(27) పరుగులు చేశారు. ఓపెనర్‌గా వచ్చిన సంజు(97*) ఆఖరి వరకు నిలబడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. శివం దూబే(8*) నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జోసెఫ్ చెరో 2, అకీల్ 1 వికెట్ పడగొట్టారు.


అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఛేజ్(40) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో బుమ్రా 2, పాండ్య, వరుణ్ చక్రవర్తి తలొక వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఇవి కూడా చదవండి:

టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ

టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్

Updated Date - Mar 01 , 2026 | 11:01 PM