స్వియటెక్ అవుట్
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:53 AM
మాజీ చాంపియన్లు డానిల్ మెద్వెదెవ్, ఇగా స్వియటెక్‌కు యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో షాక్ తగిలింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో స్థానిక ఆటగాడు టియఫో 7-6 (1), 6-4, 7-6 (5)తో 2021 యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్ (రష్యా)ను చిత్తు చేశాడు.
మెద్వెదెవ్ ఇంటికి
క్వార్టర్స్‌కు అల్కారజ్, షెల్టన్
ఆండ్రీవా, పెగుల, జెంగ్ ముందుకు
యూఎస్ ఓపెన్
న్యూయార్క్: మాజీ చాంపియన్లు డానిల్ మెద్వెదెవ్, ఇగా స్వియటెక్‌కు యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో షాక్ తగిలింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో స్థానిక ఆటగాడు టియఫో 7-6 (1), 6-4, 7-6 (5)తో 2021 యూఎస్ ఓపెన్ విజేత మెద్వెదెవ్ (రష్యా)ను చిత్తు చేశాడు. డిఫెండింగ్ చాంప్ అల్కారజ్ 6-4, 6-3, 6-4తో 20వ సీడ్ టామీ పాల్ (అమెరికా)ని ఓడించి క్వార్టర్స్ చేరాడు. ఇతర ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ 6-2, 6-3, 6-4తో స్టెఫనోస్ సిట్సిపాస్‌పై, అలెక్స్ మిచెల్సన్ 7-6 (6), 6-4, 6-4తో 27వ సీడ్ ఎచెవెరీపై గెలిచారు. మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ కిన్వెన్ జెంగ్ 7-5, 6-3తో ఆరు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, ఎనిమిదో సీడ్ స్వియటెక్‌ను ఇంటిముఖం పట్టించింది. మూడో సీడ్ జెస్సిక పెగుల 6-3, 6-4తో 16వ సీడ్ సిర్‌స్టియాపై, ఐదో సీడ్ ఆండ్రీవా 5-7, 6-4, 6-3తో 24వ సీడ్ పొటపోవాపై, 26వ సీడ్ ఎమ్మా నవారో 6-4, 6-2తో 21వ సీడ్ కలిన్‌స్కియాపై, ఆరో సీడ్ లిండా నొస్కోవా 7-5, 5-7, 6-4తో 11వ సీడ్ మార్టా కోస్ట్యుక్‌పై గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు.
ఈ వార్తలనూ చదవండి
55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్
బిట్టు ఓ హీరో.. అతడికి అంతర్జాతీయ గుర్తింపు రావాలి: కెవిన్ పీటర్సన్