గిల్‌కు గాయం
ABN , Publish Date - Sep 26 , 2026 | 02:33 AM
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం ఆందోళన కలిగిస్తోంది.
విండీస్‌తో సిరీస్ రేపటి నుంచే
తిరువనంతపురం: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం నెట్ ప్రాక్టీ్‌సలో భాగంగా పేసర్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తాకింది. దీంతో బాధతో విలవిల్లాడిన గిల్ 20 నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు కేవలం త్రోడౌన్స్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడు.
ఇక అఫ్ఘాన్‌తో వన్డే సిరీ్‌సకు దూరమైన విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సైతం నెట్స్‌లో బ్యాటింగ్ కొనసాగించారు. అటు ఈనెల 23నే భారత్‌లో అడుగుపెట్టిన విండీస్ క్రికెటర్లు మాత్రం ఇప్పటిదాకా ప్రాక్టీస్ ఆరంభించలేదు. మరోవైపు విరాట్, రోహిత్ తమ టీమ్ హోటల్లో జరిగిన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారిద్దరూ సంభాషించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్