Share News

స్ర్పింట్‌ కింగ్‌.. బూన్‌సన్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 02:28 AM

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన 100 మీటర్ల రేసు టైటిల్‌ను థాయ్‌లాండ్‌ కుర్రాడు పురిపోల్‌ బూన్‌సన్‌ దక్కించుకున్నాడు.

స్ర్పింట్‌ కింగ్‌.. బూన్‌సన్‌
Asian Games

  • థాయ్‌లాండ్‌ స్టార్‌కు 100 మీటర్ల టైటిల్‌

  • రికార్డు ప్రదర్శనతో రేసు కైవసం

నగోయా: ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన 100 మీటర్ల రేసు టైటిల్‌ను థాయ్‌లాండ్‌ కుర్రాడు పురిపోల్‌ బూన్‌సన్‌ దక్కించుకున్నాడు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల స్ర్పింట్‌ ఫైనల్‌ రేసును బూన్‌సన్‌ 9.90 సెకన్లలో ముగించి చాంపియన్‌గా నిలిచాడు. గత హాంగ్జౌ క్రీడల్లో రజతంతో సరిపెట్టుకున్న 20 ఏళ్ల బూన్‌సన్‌ ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో పరిగెత్తి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో బూన్‌సన్‌ ఈ గేమ్స్‌లో సరికొత్త రికార్డు టైమింగ్‌ను నమోదు చేశాడు.


అంతకుముందు సెమీఫైనల్‌ రేసులో తానే నెలకొల్పిన 9.91 సెకన్ల రికార్డు టైమింగ్‌ను ఫైనల్లో 0.1 సెకన్ల తేడాతో అధిగమించడం విశేషం. ఇక, ఒమన్‌కు చెందిన సోదరులు అలీ అల్‌ బలూషి (10.04 సె.), మల్హామ్‌ అల్‌ బలూషి (10.11 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలను చేజిక్కించుకొన్నారు. కాగా, ఈ ప్రదర్శనతో బూన్‌సన్‌.. 100 మీటర్లలో వేగవంతమైన రెండో ఆసియా అథ్లెట్‌గా నిలిచాడు. చైనాకు చెందిన సూ బింగ్టియాన్‌ (టోక్యో ఒలింపిక్స్‌లో 9.83 సెకన్లు) తొలి స్థానంలో ఉన్నాడు.


ఈ వార్తలనూ చదవండి:

ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్‌

అదిరింది గురి వచ్చింది పసిడి

Updated Date - Sep 26 , 2026 | 02:28 AM