పసిడి పోరుకు శీతల్
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:47 AM
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత స్టార్ శీతల్ దేవి స్వర్ణపోరుకు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం సెమీస్‌లో సహచరి సరితపై శీతల్ 145-143తో గెలిచింది. ఫైనల్లో ఐజదా సీడన్ (కజకిస్థాన్)తో దేవి తలపడనుంది.
అహ్మదాబాద్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత స్టార్ శీతల్ దేవి స్వర్ణపోరుకు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగం సెమీస్‌లో సహచరి సరితపై శీతల్ 145-143తో గెలిచింది. ఫైనల్లో ఐజదా సీడన్ (కజకిస్థాన్)తో దేవి తలపడనుంది. పురుషుల విభాగం సెమీస్‌లో వరల్డ్ చాంపియన్ తోమన్ కుమార్ 141-143తో అబ్బాస్ ఖాదిమ్ (ఇరాక్) చేతిలో ఓడాడు. శ్యాంసుందర్, తోమన్‌తో కూడిన పురుషుల కాంపౌండ్ జట్టు కూడా ఫైనల్ చేరింది. కానీ, శీతల్, పాయల్ నాగ్‌లతో కూడిన మహిళల జట్టు సెమీస్‌లో ఓడి కాంస్యం కోసం తలపడనుంది. అంధుల కేటగిరీ ఫైనల్లో తన్వీ ప్రవీణ్ ఇంగాలే 4-6తో క్రిస్టోస్ మిసో చేతిలో ఓడి రజతం సొంతం చేసుకోగా.. కాంస్య పోరులో యుగళ్ గర్గ్ 6-2తో పవన్ కుమార్‌పై గెలిచాడు. పురుషుల క్వార్టర్స్‌లో సెహజ్‌వీర్ సింగ్ 0-6తో గాంగ్ జున్ చేతిలో ఓడాడు. రికర్వ్ మిక్స్‌డ్ సెమీస్‌లో భావన-హర్వీంద్ 6-0తో ఇండోనేసియా జంటపై గెలిచి పతకాన్ని ఖాయం చేసుకొన్నారు. రికర్వ్ పురుషులు, మహిళల జట్లు ఫైనల్ చేరాయి. పురుషుల టీమ్ ఈవెంట్ సెమీస్‌లో హర్వీందర్, విజయ్ జట్టు 5-1తో చైనాపై, భావన, పూజలతో కూడిన మహిళల జట్టు 6-2తో ఇరాన్‌పై గెలిచాయి.
ఈ వార్తలనూ చదవండి
కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!
55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్