Share News

Mohammed Shami: షమికి ‘సర్‌’ పిలుపు

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:12 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి అతడి సోదరుడు...

Mohammed Shami: షమికి ‘సర్‌’ పిలుపు

కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా తమ ఎదుట విచారణకు హాజరు కావాలని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి అతడి సోదరుడు మహ్మద్‌ కైఫ్‌కు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సమన్లు జారీ చేసింది. ‘సర్‌’ ప్రక్రియలో ఓటరు మ్యాపింగ్‌కు సంబంధించి సరైన సమాచారం లేకపోవడంతో అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రిజిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని వారిద్దరికి సూచించింది. కోల్‌కతా మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 93వ వార్డులో షమి ఓటరుగా నమోదయ్యాడు. ఈ ప్రాంతం రాష్‌బెహారీ అసెంబ్లీ నియోజకవర్గం పరిథిలోకి వస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో పుట్టినా..చాలా ఏళ్లుగా షమి కోల్‌కతాలో నివాసముంటున్నాడు.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:12 AM