Share News

కీళ్ల నొప్పులతో కెరీర్‌ ముగుస్తుందనుకొని..

ABN , Publish Date - Aug 01 , 2026 | 05:23 AM

హరియాణాకు చెందిన 27 ఏళ్ల సీమా కలిరమ్నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల్ని అధిగమించి గ్లాస్గోలో కాంస్య పతకంతో...

 కీళ్ల నొప్పులతో కెరీర్‌ ముగుస్తుందనుకొని..

హరియాణాకు చెందిన 27 ఏళ్ల సీమా కలిరమ్నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల్ని అధిగమించి గ్లాస్గోలో కాంస్య పతకంతో అందరినీ ఆశ్చర్యపరచింది. 2022లో ప్రసవానంతరం సీమకు అనూహ్యంగా ఆర్థరైటిస్‌ సమస్య ఏర్పడింది. ఎంతగా అంటే రోజువారీ జీవితంలో వస్తువులను కూడా ఎత్తలేనంతగా! దాంతో కిలో బరువుండే డిస్క్‌ను విసరడం ఇక కలేనని భావించిన సీమ..తన అథ్లెటిక్‌ కెరీర్‌ ముగిసినట్టేనని తీవ్ర వేదనకు లోనైంది. సీమ భర్త, కోచ్‌, డిస్కస్‌ త్రో జాతీయ మాజీ చాంపియన్‌ అయిన రవీంద్ర కలిరమ్నా భార్యకు సమస్యపై ఎంతో పరిశోధన చేశాడు. నొప్పుల నుంచి ఉపశమనానికి ఆయుర్వేద మందులు వాడాడు. సీమ ఆహారంలో సమూల మార్పులు చేశాడు. వారి ప్రయత్నాలు మెల్లగా ఫలించి సీమ నెమ్మదిగా డిస్క్‌ను విసరడం ఆరంభించింది. ఆరోగ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకొని ప్రస్తుతం కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం నెగ్గింది. గ్లాస్గో బయలుదేరేముందు ‘అమ్మా..నాకోసం పతకం తేవా’ అని సీమ కుమారుడు రుద్ర అడిగాడట. ఆ విషయం చెబుతూ ఆమె తెగ మురిసిపోతోంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 05:23 AM