సెమీస్‌కు సాత్విక్ జోడీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:22 AM
భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్/చిరాగ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. అయితే వెటరన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది.
శ్రీకాంత్ పరాజయం చైనా మాస్టర్స్
షెన్‌జెన్ (చైనా): భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్/చిరాగ్ చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకుపోయింది. అయితే వెటరన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్‌ఫైనల్‌కే పరిమితమైంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ రౌండ్-8 పోరులో సాత్విక్/చిరాగ్ జోడీ 21-13, 16-21, 21-18తో కిమ్ ఆస్ట్ర్‌ప/ఆండర్స్ రాస్‌ముసేన్ (డెన్మార్క్) జంటపై విజయం సాధించింది. ఇక క్వార్టర్‌ఫైనల్లో 33 ఏళ్ల శ్రీకాంత్ 16-21, 16-21తో ప్రపంచ 25వ ర్యాంకర్ లీ చుక్ (హాంకాంగ్) చేతిలో పరాజయం చవిచూశాడు.
ఈ వార్తలను కూడా చదవండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు: ఎంపీ శ్రీభరత్