‘వంద’ శతకాల బ్యాట్లు..
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:44 AM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్లోని అపురూపమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు...
మాస్టర్ జ్ఞాపకాలు
అభిమానులకు మ్యూజియంలో సచిన్ బ్యాటోగ్రఫీ
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్లోని అపురూపమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన సమయాల్లో ఉపయోగించిన 26 బ్యాట్లతో పాటు తన కెరీర్లోని కీలక సందర్భాల్లో వాడిన హెల్మెట్లు, జెర్సీలు, జ్ఞాపికలను ముంబై క్రికెట్ సంఘం (ఎమ్సీఏ)కు అందజేయనున్నాడు. ఈ విలువైన వస్తువులను అభిమానుల కోసం ఎంసీఏ శరద్ పవార్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు ‘బ్యాటోగ్రఫీ’ అని నామకరణం చేశారు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి 13 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈనెల 16వ తేదీన ఈ ప్రదర్శనను ఆవిష్కరిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News