Share News

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:13 AM

మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకొన్న ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. 2022 తర్వాత తొలిసారి ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు...

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు సింధు

న్యూఢిల్లీ: మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకొన్న ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు.. 2022 తర్వాత తొలిసారి ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోన్న 31 ఏళ్ల సింధు.. గతవారం హైలో ఓపెన్‌, జూలైలో జపాన్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గింది. అంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరింది. దీంతో వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ తాజా ర్యాంక్‌ల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకిన సింధు ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె మెగా టోర్నీకి అర్హత సాధించినట్టు బుధవారం బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. చైనాలోని హాంగ్‌జౌలో డిసెంబరు 9 నుంచి 13 వరకు వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌ జరగనుంది. ఈ టోర్నీలో టాప్‌-8 ర్యాంక్‌ షట్లర్లు మాత్రమే పాల్గొంటారు. ఈ మెగా టోర్నీకి సింధు అర్హత సాధించడం ఇది ఆరోసారి కాగా, 2022లో సింధు గాయంతో తప్పుకొంది. ఇక, 2018లో సింధు ఈ టోర్నీ విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి:

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!

Updated Date - Nov 05 , 2026 | 04:13 AM