ఫ్రెంచ్ ఓపెన్‌లో పీవీ సింధుకు నిరాశ.. ఫైనల్లో ఓటమి..
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:12 PM
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్ ఓపెన్ 2026లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ అన్ సెయంగ్ చేతిలో ఆమె ఓటమి పాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్ ఓపెన్ 2026లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ అన్ సెయంగ్ చేతిలో ఆమె ఓటమి పాలైంది. తొలి గేమ్‌ను గెలిచి టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన సింధు.. ఆ తర్వాతి రెండు గేముల్లో తడబాటుకు గురైంది. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని అడ్డుకోలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు అన్ సెయాంగ్‌తో 11 సార్లు తలపడిన సింధు.. ఒక్కసారి కూడా గెలవలేకపోవడం గమనార్హం (PV Sindhu French Open 2026).
మ్యాచ్ ఆరంభంలో సింధు ఆత్మవిశ్వాసంతో ఆడింది. అన్ సెయంగ్‌ను కోర్టు నలుమూలలా కదిలిస్తూ, నెట్ వద్ద చక్కటి షాట్లు, డ్రాప్ షాట్లు, స్మాష్‌లతో పాయింట్లు సాధించింది. తొలి గేమ్‌ను 21-16తో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ నంబర్‌వన్‌ను ఓడించి టైటిల్ గెలుస్తుందనే ఆశలు పెరిగాయి. రెండో గేమ్‌లో అన్ సెయంగ్ తన ఆటతీరును మార్చుకుంది. వేగవంతమైన షాట్లు, కచ్చితమైన ప్లేస్‌మెంట్‌తో సింధుపై ఒత్తిడి పెంచింది. గేమ్ మొత్తం ఆధిపత్యం కొనసాగించి 21-11తో సత్తా చాటింది (PV Sindhu final match).

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు కాసేపు ప్రతిఘటించింది. కొన్ని కీలక పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చింది. అయితే, అన్ సెయంగ్ (An Se Young) వేగంగా, రక్షణాత్మకంగా ఆడుతూ, వరుస దాడులు చేసి సింధుకు ఇబ్బందులు సృష్టించింది. చివరకు 21-12తో మూడో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. మొత్తం 61 నిమిషాల పాటు ఫైనల్ పోరు సాగింది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన 11 మ్యాచ్‌ల్లోనూ సింధు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది.
ఇవి కూడా చదవండి..
ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..
మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..