Share News

క్వార్టర్స్‌లో సింధు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:31 AM

భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ హైలో ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో...

క్వార్టర్స్‌లో సింధు

హైలో ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ హైలో ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-9, 21-6 తేడాతో చెందిన ఒక్టావియా పాంకసరి (ఫ్రాన్స్‌)పై గెలిచింది. కేవలం 30 నిమిషాల్లోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు. కాగా బుధవారం రాత్రి జరిగిన రౌండ్‌-32లో సింధు 21-10, 21-10 తేడాతో ప్రకృతి భారతి (యూఏఈ)ని ఓడించింది. మరో ప్రీక్వార్టర్స్‌లో ఇషారాణి, మాళవిక బన్సోడ్‌లకు ఓటములు ఎదురయ్యా యి. ఇక పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో లక్ష్య సేన్‌ 21-15, 18-21, 21-12 తేడాతో కిరణ్‌ జార్జిపై గెలిచాడు. బుధవారం జరిగిన రౌండ్‌-32లో ప్రణయ్‌, తరుణ్‌లకు ఓటమి ఎదురైంది.

ఇవి కూడా చదవండి:

డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..

28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు

ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు

Updated Date - Oct 30 , 2026 | 05:33 AM