సెమీస్‌లో సింధు X అన్మోల్
ABN , Publish Date - Oct 31 , 2026 | 02:04 AM
హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.
హైలో ఓపెన్‌లో లక్ష్య ముందుకు
సార్‌బ్రూకెన్ (జర్మనీ): హైలో ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, భారత్‌కే చెందిన యువ క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో సింధు 21-12, 21-10తో అమేలీ షుల్జ్ (జర్మనీ)పై, అన్మోల్ 21-17, 18-21, 21-16తో సహచర షట్లర్, ఆరోసీడ్ ఉన్నతి హుడాపై గెలిచి అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 14-21, 21-17, 21-13తో కొల్జోనెన్ (ఫిన్లాండ్)ను ఓడించి సెమీఫైనల్ చేరాడు.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!