Share News

తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:29 AM

గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్‌ తొలి క్లాసిక్‌ గేమ్‌లో భారత జీఎం ప్రజ్ఞానందకు షాక్‌ తగిలింది. అమెరికా జీఎం ఫాబినో కరువానా చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు.

తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి

సెయింట్‌ లూయిస్‌ (యూఎస్‌): గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్‌ తొలి క్లాసిక్‌ గేమ్‌లో భారత జీఎం ప్రజ్ఞానందకు షాక్‌ తగిలింది. అమెరికా జీఎం ఫాబినో కరువానా చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. ఇటాలియన్‌ ఓపెనింగ్‌తో ఆటను ఆరంభించిన కరువానా 48 ఎత్తుల్లోనే ప్రజ్ఞానంద ఆటకట్టించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకొన్నాడు. మూడో స్థానం కోసం తలపడుతున్న సో వెస్లీ, విన్సెంట్‌ కీమర్‌ మధ్య గేమ్‌ డ్రాగా ముగిసింది.


ఇవి కూడా చదవండి:

వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

నా సెంచరీకి శ్రీలంక ప్లేయర్ కూడా కారణం: జురెల్

Updated Date - Aug 27 , 2026 | 03:29 AM