Share News

ప్రీక్వార్టర్స్‌కు పెగుల

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:10 AM

టైటిల్‌ ఫేవరెట్‌, మూడోసీడ్‌ జెస్సిక పెగుల యూఎస్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో పెగుల 1-6, 6-4, 6-3తో లెలా ఫెర్నాండెజ్‌పై అతికష్టమ్మీద గెలిచింది.

ప్రీక్వార్టర్స్‌కు పెగుల

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంక ముందంజ

న్యూయార్క్‌: టైటిల్‌ ఫేవరెట్‌, మూడోసీడ్‌ జెస్సిక పెగుల యూఎస్‌ ఓపెన్‌లో ప్రీక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో పెగుల 1-6, 6-4, 6-3తో లెలా ఫెర్నాండెజ్‌పై అతికష్టమ్మీద గెలిచింది. ప్రపంచ నెం.1 సబలెంక 6-3, 6-4తో రఖిమోవాపై, 11వ సీడ్‌ కోస్ట్యుక్‌ 6-3, 6-2తో 18వ సీడ్‌ ఎకటరీనా అలెగ్జాండ్రోవాపై నెగ్గి రౌండ్‌-16లో ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో 16వ సీడ్‌ సొరానా సిర్‌స్టియ 6-5, 6-3తో 19వ సీడ్‌ పోలినికి షాకిచ్చింది. కాగా..రెండోసీడ్‌ రిబకినా, నాలుగోసీడ్‌ గాఫ్‌, ఐదోసీడ్‌ ఆండ్రీవా, 14వ సీడ్‌ జోవిక్‌, 15వ సీడ్‌ ఈలా, మరియా సకారి సునాయాస విజయాలతో మూడో రౌండ్‌కు చేరారు. పురుషుల్లో..టాప్‌సీడ్‌ జ్వెరెవ్‌, ఐదోసీడ్‌ కొబోలి, 14వ సీడ్‌ టీన్‌ మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు. అయితే ఆరో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌కు రెండో రౌండ్‌లో ఝలక్‌ తగిలింది.

శ్రీరామ్‌ జోడీ బోణీ: భారత్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ/ఇవాన్‌ కింగ్‌ (అమెరికా) జోడీ పురుషుల డబుల్స్‌లో శుభారంభం చేసింది. తొలిరౌండ్లో శ్రీరామ్‌ జంట 3-6, 7-6 (7), 7-6 (10)తో శాండర్‌ అరెండ్స్‌/డేవిడ్‌ పెల్‌ (నెదర్లాండ్స్‌) ద్వయంపై గెలిచింది.

ఈ వార్తలను కూడా చదవండి

ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

Updated Date - Sep 05 , 2026 | 01:10 AM