Share News

ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:50 PM

మండలంలోని కొర్రా గ్రామానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు.

ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు
గుజ్జెల జ్యోతిలక్ష్మి, శెట్టి రాంబాబు

కొర్రా గ్రామ ఉపాధ్యాయులకు రాష్ట్ర, జిల్లా స్థాయి పురస్కారాలు

డుంబ్రిగుడ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొర్రా గ్రామానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అత్యున్నత పురస్కారాలు దక్కడంతో గ్రామస్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండలంలోని కొర్రా పంచాయతీ కొర్రా గ్రామానికి చెందిన గుజ్జెల జ్యోతిలక్ష్మి, శెట్టి రాంబాబులకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు దక్కాయి.

గుజ్జెల జ్యోతిలక్ష్మి : కొర్రా గ్రామానికి చెందిన జ్యోతిలక్ష్మి 2001 డీఎస్సీలో ఎంపికైంది. ఈమె ప్రస్తుతం లైగండా మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈమె విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. ఈమెకు 2020, 2024లలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు. జ్యోతిలక్ష్మి కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా, ఉమ్మడి జిల్లాల తరుపున ప్రతినిధిగా 8వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో పలు పాఠ్యంశాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు.

శెట్టి రాంబాబు: కొర్రా గ్రామానికి చెందిన రాంబాబు 1994లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 8 భాషాల వలంటీర్‌గా పనిచేసి 2001లో డీఎస్సీలో ఉపాధ్యాయుడుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అనంతగిరి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సోషల్‌ ఉపాఽధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈయన విద్యా సంస్కరణలో భాగంగా ఫిన్లాండ్‌ దేశంలో శిక్షణ పొందారు. 2025-2026లో విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు.

Updated Date - Sep 04 , 2026 | 11:50 PM