పాకిస్థాన్ అవుట్.. బంగ్లాదేశ్‌కు చోటు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:28 AM
భారత్ ఆతిథ్యమిస్తున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్) శుక్రవారం ప్రకటించింది.
జూ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలగింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. పంజాబ్‌లో ఈనెల 27న చాంపియన్‌షి్‌ప మొదలవనుంది. వాస్తవంగా..ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ బరిలో దిగుతున్న విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గతనెలలో ధ్రువీకరించారు. కానీ భారత్‌లో ఆడేందుకు ఆసక్తి చూపని పీహెచ్‌ఎ్‌ఫ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చాలని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)ను కోరింది. కాగా..పాకిస్థాన్ చివరి నిమిషంలో వైదొలగవచ్చునన్న అంచనాలతో ఆ జట్టు స్థానంలో ఒమన్, బంగ్లాదేశ్‌లను ఏహెచ్‌ఎఫ్ రిజర్వ్‌గా ఉంచింది. పాకిస్థాన్ తప్పుకొన్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను ఆడించాలని నిర్ణయించింది.
నవంబరు 5 వరక జరిగే ఆసియా కప్‌లో.. మ్యాచ్‌లు జలంధర్, మొహాలీ వేదికలుగా నిర్వహిస్తారు. వచ్చేనెల రెండు వరకు లీగ్ పోటీలన్నీ జలంధర్‌లో జరుగుతాయి. నాలుగున సెమీఫైనల్స్, ఐదున కాంస్య, స్వర్ణ పతక మ్యాచ్‌లు నిర్వహిస్తారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, బంగ్లాదేశ్ తలపడతాయి. ఒక్కో జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. చాంపియన్‌షి్‌ప తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొంటుంది. 29న చైనాతో, 30న జపాన్‌తో, నవంబరు ఒకటిన మలేసియాతో, నవంబరు రెండున దక్షిణకొరియాతో భారత్ తలపడుతుంది. భారత్ ఆడే లీగ్ మ్యాచ్‌లన్నీ రాత్రి ఏడు గంటలకు మొదలవుతాయి. అక్టోబరు 28, 31, నవంబరు మూడు విశ్రాంతి దినాలు.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు