పసిడి పట్టి.. చరిత్రకెక్కి
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:42 AM
భారత యువ రెజ్లర్ మనీషా భన్వాలా చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది.
ప్రపంచ రెజ్లింగ్‌లో మనీషా సంచలనం
అస్టానా (కజకిస్థాన్): భారత యువ రెజ్లర్ మనీషా భన్వాలా చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. తద్వారా ఈ మెగా టోర్నీలో పసిడి అందుకున్న తొలి భారత మహిళగా 29 ఏళ్ల మనీషా అరుదైన ఘనత సాధించింది. ఓవరాల్‌గా సుశీల్ కుమార్ తర్వాత ప్రపంచ విజేతగా నిలిచిన రెండో భారత రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. సుశీల్ 2010లో బంగారు పతకం దక్కించుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 59 కిలోల స్వర్ణ పతక పోరులో హరియాణాకు చెందిన మనీషా 8-6తో అబిగెయిల్ నెట్టె (అమెరికా)ను చిత్తుచేసింది. ఆరంభంలో 0-6తో వెనుకంజలో నిలిచిన మనీషా.. అద్భుతంగా పుంజుకొని ఫలితం రాబట్టింది. ఇక, ఇదే టోర్నీలో ఫైనల్ చేరిన మరో ఇద్దరు భారత రెజ్లర్లు నీలమ్ సిరోహి (50 కి), కాజల్ దోచక్ (76 కి) రజతాలతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!
కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!