Share News

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

ABN , Publish Date - Apr 01 , 2026 | 10:57 AM

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్‌మెంట్‌కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు.

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2026 కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్‌మెంట్‌కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


బ్యూనస్ ఐరీస్‌లోని లా బొంబోనేరా స్టేడియంలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 5-0 తేడాతో జాంబియాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సి ఒక గోల్ చేయడంతో పాటు మరో గోల్‌కు అద్భుతమైన అసిస్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే జూలియన్ ఆల్వారెజ్ గోల్‌కు మెస్సి అద్భుత పాస్ ఇచ్చి జట్టుకు ఆధిక్యం తీసుకొచ్చాడు. హాఫ్ టైమ్‌కు ముందు తన వ్యక్తిగత ప్రతిభతో మరో గోల్ చేసి, అంతర్జాతీయ కెరీర్‌లో 116వ గోల్ నమోదు చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం మెస్సి భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం, అభిమానుల హర్షధ్వానాల నడుమ.. వస్తోన్న కన్నీళ్లను మెస్సి ఆపుకోలేకపోయాడు. దీంతో అదే స్వదేశంలో తన చివరి మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


మెస్సి నాయకత్వంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు 2022 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో, మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్‌లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్ కొత్త హీరో.. అసలు ఎవరీ కూపర్ కనోలీ!

ఫిఫా ప్రపంచ కప్: వరుసగా మూడోసారి.. ప్లే ఆఫ్స్ నుంచే నిష్క్రమించిన ఇటలీ

Updated Date - Apr 01 , 2026 | 11:01 AM