స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సి తండ్రి కన్నుమూత
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:07 PM
స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇంట విషాదం చోటుచేసుకుంది. మెస్సి తండ్రి జార్జ్ మెస్సి(68) కన్నుమూశారు.
స్పోర్ట్స్ డెస్క్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఇంట విషాదం చోటుచేసుకుంది. మెస్సి తండ్రి జార్జ్ మెస్సి(68) కన్నుమూశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. చాలాకాలం నుంచి జార్జ్ మెస్సి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అర్జెంటీనాలోని తన స్వస్థలమైన రోసారియోలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన స్వగృహంలోనే ఆయన మరణించారు.
లియోనెల్ మెస్సి ప్రపంచం వ్యాప్తంగా మంచి పేరు, ప్రతిష్ఠలు సంపాదించడంలో అతడి తండ్రి జార్జ్ మెస్సి కృషి ఎంతో ఉంది. మెస్సి కెరీర్‌ను తీర్చిదిద్దడంలో జార్జ్ కీలక పాత్ర పోషించారు. బాల్యం నుంచి అంతర్జాతీయ సాకర్ దిగ్గజంగా ఎదిరే వరకు మెస్సి కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఈ ఏడాది జూన్‌లో జార్జ్ మెస్సి ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
జార్జ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని జార్జ్ కుటుంబం వెల్లడించింది. అయితే ఇటీవల జరిగిన ఫిపా ప్రపంచ కప్ సమయంలో జార్జ్ మెస్సి మరణించినట్లు వార్తలు రాగా.. ఆయన కుటుంబం తీవ్రంగా ఖండించింది. లియోనెల్ మెస్సి నాయకత్వం వహిస్తున్న అర్జెంటీనా జట్టు ఇటీవల జరిగిన ఫిపా ప్రపంచ కప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్పెయిన్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!
లంక బౌలర్లపై విరుచుకుపడ్డ భారత పేసర్ గుర్నూర్!